ఈ పుట ఆమోదించబడ్డది
ఈ పటము కొనమొగ్గయొక్క సూక్ష్మనిర్మాణము తెలుపును. ఇందు నాలుగు ఖండములు గలవు (ఖం4. ఖం3. ఖం2. ఖం1). ఒక్కొక ఖండమునందు స్కంధశిరము (స్కం.శి). స్కంధము (స్కం) అను రెండు భాగములు గలవు. స్కంధశిరములనుండి ఆకులు (ఆ3. ఆ2. ఆ1.) పుట్టును. స్కంధశిరము అనేక కణములవలన నేర్పడినది. స్కంధము ఒకటే కణము. ఖం1 - అను మొదటి ఖండమునందలి స్కంధములో జీవస్థానము గుండ్రముగ నున్నది. ఖం2. అనురెండవ ఖండములోని స్కంధములో నది అడ్డముగా సాగియున్నది. జీ - చూడుము. పటముయొక్క కొనయందున్న అంత్యకణము (ఆ.క) యొక్క ఆకారము చూడుము. ఇందు అవకాశములు లేవు. జీ - జీవస్థానము గుండ్రముగ నున్నది.