వచ్చును. పై జెప్పబడిన జీవస్థానములు గుండ్రనైన కణికలవలెనుండి మధ్య కొంచెము వంగియుండును. రంగులలో ముంచియుంచిన వారిపర్ణియొక్క సూక్ష్మములగు తునకలలో ఇవి మిక్కిలి బాగుగ కనుబడుచుండును.
శాఖాంతముయొక్క సూక్ష్మనిర్మాణము.
పైని వ్రాసినసామాన్యవర్ణనలో ప్రతిశాఖాంతమును కొనమొగ్గచే గప్పబడి ముగియునని వ్రాసియుంటిమి. ఇచ్చటి స్కంధశిరమునుండి నలువైపులను పుట్టి మొగ్గగా ముడుచుకొను ఆకులను (ఆ3.) త్రుంచివేయగా స్కంధశిరము వెల్లడియగును (18-వ పటమున ఖం4. లో స్కం. శి. చూడుము). ఆ స్కంధశిరము పైని స్కంధకణ మగపడును. ఆస్కంధముయొక్క కొనయందు తిరిగి యొక చిన్న ఆకులవరుసయును (ఆ2.) వానిచే కప్పబడి యొక చిన్న స్కంధశిరమును (ఖం3. లో స్కం. శి.) కనిపించును. ఈయాకులుగూడ మొగ్గలవలె ముడుచుకొని యుండును. వీనిని నెమ్మదిగా త్రుంచివేయగా, తత్పూర్వపుఖండములోని వానికంటె చిన్నవైన స్కంధమును, స్కంధశిరమును (ఖం2. లో స్కం. శి.) చిన్న చిన్న ఆకులును (ఆ1.) బయటబడును. వీనినిగూడ త్రుంచగా వానిలోపల సూక్ష్మదర్శినిలోగాని స్పష్టముగా కానరాని యతి సూక్ష్మమగుభాగ ముండును (పటములో పైఖండము (ఖం1.) లోని స్కం. స్కం. శి. చూడుము).ఇందలి కనుపునుండి (ఖం1. లో స్కం. శి.) వెలువడు చిన్న మొటిమలు ఆకులయొక్క ప్రథమరూపములు. వీనికి పై తట్టున లింగాకారముగా నుండు నిజమైనకొన యనదగు అంత్యకణము (అ. క.) సూక్ష్మదర్శనితో చూడగా కనిపించును. ఇది యేకకణము. దీనికి వృద్ధికణము