Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బదులుగా పోగుమధ్య రెండు క్రొత్తపిల్లకణము లేర్పడుటచే పోగు పెద్దదగును. ఇట్టిపెంపునకే నడిమిపెంపు (Interstitial growth) అని పేరు. బూజుపోగునందలి కొన పెంపు (Terminal growth) నకును, దీనికిని గలభేదము చక్కగా తెలిసికొన నగును (116-వ పుట చూడుము). బూజుపోగుయొక్క రెండుకొనలకును భేద ముండుటకును పసిరికపోగుయొక్క రెండుకొన లొక్కరీతిగనే యుండుటకును పెంపునందలి వ్యత్యాసమే కారణము.

2. స్త్రీపురుషసంయోగము:- వేసవియందును, ఆకురాలు కాలమందును సమీపముననున్న రెండుపోగు లొక దానిప్రక్క నొకటి సమాంతర రేఖల (Parallel lines) వలె చేరును (15-వ పటములో B. చూడుము). ఇట్లు చేరిన కణములందు ఎదు రెదురుగా నుండువైపున గుండ్రనిపొట్టిమొటిమలు కణమున కొక్కొక్కటిచొప్పున నంకురించును. ఆ మొటిమలు పెరిగి యొకకణముయొక్క మొటిమ పటములో B-లో జూపబడినప్రకారము దాని యెదుటనున్న కణముయొక్క మొటిమతో కలియును. అట్లు కలియునప్పు డా రెండుమొటిమల మధ్యనుండు గోడ హరించిపోయి రెండుకణములకును మార్గ మేర్పడును. ఇట్లనేక కణములు ఒక్క సారిగా జతలుగా గూడి ఉద్దులు పట్టినట్లుగా సంబంధములు కలుపుకొనును. ఈరెండుపోగుల చేరికకు పటములో B-లో జూప బడినట్లు నిచ్చెనవంటిరూపము గలుగును.

ఈ పోగులయందలి కణములలో నొక్కొకకణము ఒక్కొక బీజాశయము (Gouad) అని చెప్పవచ్చును. ఈబీజాశయములలోని