మునకును మరియొకకణమునకును మధ్య నడ్డముగ వ్యాపించు సెల్లులూసుపొరలు పోగును వెవ్వేరుకణముల విభజించును (A.లో అ. పొ. చూడుము). కణమునందలి మూలపదార్థమును గూర్చి కొన్ని విశేషవిషయములు గలవు.
ఈవరకు చదివిన జీవులలోని కణములందు అవకాశములు చూచుయున్నాము. వృక్షజాతికణములలో ముదురు వానియందు ఈ యవకాశములు మిక్కిలి పెద్దవి యగుటచే మూలపదార్థము స్వల్పమై కణకవచము నంటి యొక పలుచని పొరగా నుండును. ఈ విషయము పసిరికపోగుల కణములందు మిక్కిలి స్పష్టముగ తెలియగలదు. కాని వీనియందు మూలపదార్థము కణకవచము నంటిమాత్రమే యుండక, అవకాశము మధ్యనుండు జీవస్థానము చుట్టును నిర్ణయమైన ఆకారములేని చిన్న సముదాయముగాను, దానినుండి కణకవచము నంటియుండు మూలపదార్థము వరకు (బండికుండనుండి పూటీలవరకు వ్యాపించు ఆకుల (Spokes) వలెను నుండునట్టి) మిక్కిలి కోమలమైన కిరణములుగాను ఏర్పడి యుండును (A-లో కి-కిరణములు, మూ. ప-మూలపదార్థము చూడుము). దీని మధ్యనుండు జీవస్థానము బాదముకాయవలె స్పష్టముగ తెలియుచుండును. దానిమధ్య నొక చుక్కవలె కనుబడు అంతర్జీవస్థానమును గలదు.
మన మీవరకు జదివిన ప్రకరణములయందు జెప్పబడినట్లు హరితకములు మూల పదార్థమునం దక్కడక్కడ చిమ్మ బడియుండక, కణకవచముయొక్క లోపలితట్టున పటములో జూప