ఈ పుట ఆమోదించబడ్డది
A. ఒక పసిరికపోగునందలి మధ్యభాగము. ఈ పోగు అనేక అడ్డుపొరల (అ.పొ) చే వేరువేరుకణములుగా విభజింపబడినది. హ.ప-హరితక పుపట్టెలు మరమేకుచుట్లవలె, కణముయొక్క కవచము (క.క.) లోపలితట్టున చుట్టిచుట్టి పోవుచున్నవి. కుడివైపున చివరనుండు కణమునందు మూలపదార్థమును, జీవస్థానమును చక్కగ తెలియు నిమిత్తమై హరితక పుపట్టెలు విడిచివేయబడినవి. అందు తెల్లగ జూపబడినభాగమంతయు అవకాశము. కణముమధ్య నుండు జీవస్థానము చుట్టును, కణకవచముయొక్క లోపలితట్టున నొక పొరగాను, ఈ