Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొర యొకటి మూలపదార్థమునందు పోగున కడ్డముగా నేర్పడి దానిని రెండుభాగములుగా విభజించును (B1. చూడుము). ఇట్లు ఏకకణప్రాణి ద్వికణప్రాణి యగును. తరువాత నీ రెంటిలో చివరనుండుకణము పెరిగి యందుండి మొదట తెగిన కణమంత కణము తిరిగి ఖండింపబడును. ఈ కణము లీ ప్రకారము హెచ్చి కొంచె మించుమించుగా సమానమైన పెక్కు కణముల పంక్తి యగును. ఊర్ధ్వతంతువుల యొక్కయు, అధస్తంతువుల యొక్కయు చివరనుండుకణములు తక్కిన కణములకంటె భేదముగనున్నవి. ఈ కణములకు కొనయందుండు కణకవచము ఆదోకగనుండి తక్కినచోట్లకంటె మృదువును పలుచనిదియు నై యుండును.

అంత్యకణము.

ఇట్లు బూజుపోగుయొక్క కొన నుండు కణమునకు అంత్యకణము (Apical Cell) అని పేరు. ఈ కణముయొక్క మూలపదార్థమునందు ఆహారమునుండి జమయగుపదార్థము, ఖర్చగు మూలపదార్థముకంటె హెచ్చుగ నుండును. కాన నీకణము పెరుగవలసియున్నది. అంతట నిది యన్నిప్రక్కలకు పెరుగ ప్రయత్నింపవలెను గదా? ఈ కణముయొక్క ఆవరణపుపొర యన్నివైపులను సమానమైన దళముగలదిగా నున్నయెడల నది యన్నివైపులను సమముగా పెరుగును. కాని దీని కణకవచ మట్లుండక చివరవైపున పలుచనిదిగాను, బలహీన మైనదిగాను, ఉన్నందున, మూలపదార్థముయొక్క యొత్తుడువలన నచ్చోట నది ముందునకు పొడుచుకొని వచ్చియుండును. కాబట్టి యీ