నొకటి జేర్చి దండగా గ్రుచ్చినయెడల బూజుపోగురూప మేర్పడును. కాబట్టి యీబూజుపోగును కణపంక్తియని చెప్పవచ్చును.
బూజుపోగుయొక్క శాఖలు: కొనదిమ్మలు.
తెల్లని బూజునుండి ఉత్పత్తియగు అనగా లేతవియగు ఊర్ధ్వతంతువులకు శాఖ లనేకము లుండవుగాని కొంచెము ముదిరిన నీలవర్ణముగల భాగమునుండి C1. C2. C3. C4. C5. పటములలో చూపిన ప్రకారము చిత్రమైన ఆకారముగల యనేకములైన కొమ్మలు బయలుదేరును. ఇందు ఒక్కొక్క కొమ్మనుండి కొన్ని పలవలు పుట్టి ఆపలవలలో నొక్కొకదాని కనేక పలవలు గలిగి యీ పలవలసమూహమంతయు నొక రమ్యమైన కుచ్చును బోలియుండును. అందు చివరపలవలు పొట్టివిగ నుండి యొక దానిసరసను మరియొక్కటి చేరియుండును. ఈ పలవల చిట్టచివర కొనదిమ్మ లను పేరుగల పొట్టికణము లుండును.
కొంతకాలమైన తరువాత నీ కొనదిమ్మచివర దృడమైన దారముతో నురిపోసి క్రమముగా బిగించి తెంపినట్లు ఒక చిన్నముక్క త్రుంచబడును (C2. చూడుము). ఇది మధుశిలీంధ్రకణము యొక్క మొటిమ తెగినట్లే తెగునని చెప్పవచ్చును.
బూజు పై గప్పియుండు ధూళియే దానిబీజములు.
ఇదియే బూజునకు బీజము. ఈబీజము తెగినతోడనే, తిరిగి దీని క్రిందిభాగమున మరియొకబీజము కొనదిమ్మనుండి పై జెప్పబడిన ప్రకారము ఖండింపబడి మొదటిబీజముక్రింద జేరును. ఇట్లనేక బీజములు తెగి యొక దానిక్రింద నొకటి గొలుసువలె జేరి