పుట:Jeevasastra Samgrahamu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విషయసూచిక.

ఉపోద్ఘాతము. 1-38.

మొదటి భాగము.

మొదటి ప్రకరణము.

వికారిణి (Amoeba)

వికారిణియొక్క శరీరనిర్మాణము, మూలపదార్థము, జీవస్థానము, సంకోచనావకాశము, కణమనగానేమి? వికారిణియొక్క వ్యాపారములు, చలనము, పోషణము, వృద్ధి, వికారిణి అంగుళములో నూరవవంతుకంటె ఏల పెరుగదు? మలమూత్రోత్సర్జనము, సంతానవృద్ధి, ద్విఖండనము, వికారిణియొక్క నివాసమునకు తగిన స్థితిగతులు, మన రక్తమునందలి కణములు, తెల్లకణములు, ఎర్రకణములు. 1-25.

రెండవ ప్రకరణము.

సూక్ష్మజీవులు (Micro-organisms).

సూక్ష్మతర్కువులు, సూక్ష్మగుటిక, సూక్ష్మదండిక, సూక్ష్మకంపర, సూక్ష్మవ్యావర్తక, మృదురోమము, శ్రమవిభాగము, సంతానవృద్ధి, సూక్ష్మ జీవులఆహారము, హరితకములు, వికారిణి ఎట్లు ఆహారముతినును? వృక్షజాతిసూక్ష్మజీవులెట్లు ఆహారముతినును? కర్బనికామ్లవాయువును విడదీయుట, మూలపదార్థమునుకట్టుట, వికారిణి ఎట్లు జీర్ణముచేసికొనును? వృక్షజాతి జీవులు ఎట్లు జీర్ణము చేసికొనును? కేవల జంత్వాహారము, కేవలవృక్షాహారము, మధ్యమజాతిసూక్ష్మజీవులు, పూతిభుక్కులు, పరాన్నభుక్కులు, చీము ఎట్లు పుట్టుచున్నది? సూక్ష్మజీవులవలన గలుగుమార్పులు, సూక్ష్మజీవుల జీవనమున కనుకూలమగు స్థితిగతులు, సమాప్తి. 26-59.

మూడవ ప్రకరణము.

మథుశిలీంధ్రము (Saccharomyces-Yeast).

కల్లును చెరుకురసమును సారాయిగామార్చునదేది? నిర్మాణము, సంతానవృద్ధి విధానములు, మధుశిలీంధ్రములశక్తిచే సారాయియెట్లు పుట్టును? పాస్ట్యూరు కషా