వేరొక చోటికి పోవు ననియు చెప్పియుంటిమి. అట్లుగాక పిల్ల ఆవర్తకారులు తరతరముల వృద్ధియగుచు ఒక్క కాడనే అంటి యుండునెడల ఎట్లుండునో ఊహించునది. అట్టిరూపము పైనివివరింపబడిన జాతివగు ఆవర్తకారులలో లేకపోయినను దానిసంబంధజాతులలో జేరిన అఖండావర్తకారి (Zoothamnium) అను జీవియందు గలదని ఎరుంగునది (ప్రక్క పటము చూడుము). దీనియందలి పిల్ల ఆవర్తకారుల కన్నిటికిని ఆహారము ఒక్క కాడనుండియే రావలెనుగదా. ఆహారము సమృద్ధిగ నున్నంతకాలము వానికిలోపములేదు. కాని ఆహారము చాలకపోవుట తటస్థించినయెడల అన్నియు నొక్కసారియె శుష్కించవలసి వచ్చును.
ఈ అఖండావర్త కారియొక్క చరిత్రము ఇండియనుల చరిత్రమును బోలియున్నది. ఇండియా అను తల్లియొక్క పిల్లలు అనగా ఇండియను లెవ్వరును పూర్వాచారముల ప్రకారము ఇండియాను విడచిపోకూడదు. పూర్వపు ఆచారములు అప్పటిరోజులకు చక్కగతగియున్నవి. ఆ కాలమున జనసంఖ్య మిక్కిలితక్కువ కాబట్టి అప్పటివారు తమసంఘమునుండి కొంతమంది విడిపోయిన యెడల తమకు బలము తక్కువగునని భయపడి ఇతర దేశముల కెవ్వరును పోకూడదను కట్టుబాట్లు చేసిరి. పూర్వమువలె నన్య