పుట:Jeevasastra Samgrahamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కౌగలించుకొనుటయు చూచి యిట్టివియే చెట్లయొక్క వివాహ సంబంధము లనుకొనుచు వచ్చితిని. ఇట్టి అబద్ధపుపెండ్లిండ్లు చూచుచు సంశయపడు నాబోటి తెనుగుదేశస్థులందరు తమగ్రంథమును జదివి యందు వివరముగ బోధింపబడిన నిజమైన స్త్రీపురుషవివక్షత మొదలగు వ్యాపారములు వృక్షాదులకుకూడ గలవని చక్కగ గ్రహింతురుగాక.

ఇంతసులభశైలిని, ఇన్ని విచిత్రాంశములను, ఇంత వివరముగ వ్రాయగలిగిన మీసామర్థ్యతను నేను ఎంత కొనియాడినను నాకు తృప్తితీరదు. మీరు వ్రాయదలచిన ఇతరభాగములునుగూడ త్వరలోముగించి మాబోటివారలకు జ్ఞానదానము చేయగలరని వేడుకొనుచున్నాను.

పోడూరి సంగయ్య.
కృష్ణాజిల్లా.
7-7-08.

శ్రీయుత టి-నారాయణస్వామి, యల్. యం. & యs. గారు ఇట్లు వ్రాయుచున్నారు:-

తెనుగుభాష నభ్యసించువారల కింతవరకును తెలిసియుండనట్టియు, మిక్కిలి యుపయుక్తమైనట్టియు, మనోహరమైనట్టియు, శాస్త్రజ్ఞానము నిచ్చినందులకైనది. గ్రంథకర్తగారు ఆంధ్రమహాజనుల కృతజ్ఞతకు నెంతయు పాత్రులని నిస్సంశయముగా జెప్పవచ్చును.

గ్రంథకర్తగారు వారికిగల కొద్దివిశ్రాంతి కాలములో నింతటి యుద్గ్రంథమును నింత చక్కగ రచియింపగలిగి రనునదియే వారి సద్గుణములగూర్చి హెచ్చుగ ఘోషించుచున్నది.