Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హించినప్పు డాపోగు పొట్టిదై లావు అగును; ఇది సంకోచము (Contraction).

II. వికారిణియొక్క మూలపదార్థమునందలి మార్పులు నెమ్మదిగను ఒక్కొకసారి కొంచెముకొంచెముగను క్రమశ: గలుగును. మృదురోమమునందలి మార్పులు అతివేగముగను ఎడతెగకుండను గలుగుచుండును.

కండసంబంధమైన సంకోచము అప్పుడప్పుడు అకస్మాత్తుగ గలుగును. ఇది వికారిణిచలనమువలె క్రమక్రమముగా గలుగునది గాదు. మృదురోమచలనమువలె నెడతెగక యుండదు. కాలక్రమములేక జంతువున కిచ్చవచ్చినప్పుడుమాత్రమే గలుగును. కాలనిర్ణయము లేక ఇచ్ఛానుసారముగ నడిమిపోగునందు అకస్మాత్తుగా గలుగునట్టి యీ సంకోచవికాసములను చూచుతోడనే ఆవర్తకారికి కండస్వభావము గలదని నిశ్చయముగా జెప్పవచ్చును.

సంతానవృద్ధి విధానములు.

1. ద్విఖండనము:- ఆవర్తకారి సామాన్యముగా ద్విఖండనవిధానముచే నిలువున రెండుగా చీలి సంతానవృద్ధి జెందును. పటములో (D1.) చూచిన దానిపైని నొక చిన్నబీట కనిపించును. ఆబీట క్రమముగా పెద్దదయి ఆవర్తకారిని రెండు పిల్లలుగా చీల్చును. ఇవిరెండును కాలక్రమమున పెరుగుచు నొక్క కాడ నంటియున్న రెండుపూర్ణవయస్కులైన ఆవర్తకారులుగా నేర్పడుచున్నవి (D2. చూడుము). కాని శీఘ్రకాలములోనే