పుట:Jeevasastra Samgrahamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంకోచనమునందలి భేదములు.

వికారిణిపాదము, మృదురోమము, కండపోగు వీని సంకోచనమునందలి భేదములు.

1. వికారిణియొక్క మూలపదార్థము ఇటునటు అను నియమము లేక ఎన్నివంకరులుగనైనను పాదములుగ సాగగలదు. ఇట్లు కొన్నిపాదములలోనికి మూలపదార్థము సాగుటయు, మరికొన్ని పాదములనుండి తిరిగి వికారిణి దేహములోనికి అది సంకోచించుటయు, ఇవియే వికారిణియొక్క చలనమునకు ముఖ్యాంగములు (9-వ పుట చూడుము).

మృదురోమము మూలపదార్థపుదారమే యని చెప్పి యుంటిమి. పై పేరాలో జెప్పబడినప్రకారము గాక దీనియందలి మూలపదార్థము క్రమానుసారముగ నొకసారి యొకవైపునకును, మరియొకసారి రెండవవైపునకును ప్రవహించుటచేత మృదురోమముయొక్క చలనము గలుగుచున్నది (35-వ పుట చూడుము).

కండపోగును మూలపదార్థపుదారమే. ఇందు మూలపదార్థము ముందుకు వెనుకకు మాత్రము ప్రవహించును; ప్రక్కలకు ప్రవహించదు. కండపోగు వికసించినప్పుడు మూలపదార్థము ముందునకును, సంకోచించినప్పుడు వెనుకకును ప్రవహించుటచే దాని ఆకారమునందలి భేదములు గలుగుచున్నవి. మూలపదార్థము ముందుకు ప్రవహించినప్పుడు కండపోగు పొడుగై సన్నమగును. ఇదియే వికాసము (Expansion). వెనుకకు ప్రవ