Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరి అభిప్రాయములు.

డాక్టరు సీ. బి. రామారావు. బి. ఏ., యెం. డి. గారు

ఇట్లు వ్రాయుచున్నారు:-

మన మనుదినమును చూచుచుండు జంతువులయందును, వృక్షములయందును క్రొత్తక్రొత్త విషయములను కనుబరచి, వానికి నూతనోజ్జీవమునిచ్చి శాస్త్రజ్ఞానము సంపాదించు వారికి తమరు క్రొత్తదారిని చూపియున్నారు. ఇందుచే ఆంధ్రజనుల కెల్లరకును శాశ్వతమైన ఉపకారమును చేసితి రనుటకు సందేహములేదు. * * తెలుగుదేశమునందు పట్టపరీక్షలనొందిన మహాజనులందరును, తమరుకనుబరచిన మంచిమార్గమును అనుగమించి మన దేశభాషలందు నిజమైనజ్ఞానమును త్వరలోనే ప్రజలకిచ్చుదురుగావుత. 12-12-08.

మహారాజశ్రీ ఆచంట లక్ష్మీపతిగార్కి.

అయ్యా,

తమచే వ్రాయబడిన జీవశాస్త్ర మనుగ్రంథమును మొదటినుండి చివరవరకు మిక్కిలిఉత్సాహముతో చదివితిని. ప్రారంభించినప్పుడు నాకీగ్రంథము బోధపడునో కాదో యని సంశయముతోనుంటిని కాని 25 పుటలు అనగా వికారిణిని గురించిన ప్రకరణమును ముగించునప్పటికి గ్రంథముయొక్క యుద్దేశమును పూర్ణముగా గ్రహింపగలిగితిని. పిమ్మట కడవరకు గ్రంథమును ముగించువరకు విడువలేక పోవునంతటిఆశ పుట్టినది.

తమరు వృక్షముల వివాహసంబంధములను వర్ణించుచు వ్రాశిన ప్రకరణము మిక్కిలి చోద్యముగనున్నది. నేను ఇదివరకు రావిచెట్లకు వేపచెట్లకు పెండ్లిండ్లుచేయుటయు, తాడిచెట్లను జువ్విచెట్లు