ఈ పుట ఆమోదించబడ్డది
A. రక్తాక్షియొక్క ఆకారము అనేక రెట్లు పెద్దదిగ చూపబడినది, జీ-జీవస్థానము. దీని మధ్యమున అంతర్జీవస్థానము స్పష్టముగ కనబడుచున్నది. సం-సంకోచనావకాశము. మృ. రో-మృదురోమము. నో-నోరు. మృదురోమము గొంతుగొట్టముయొక్క అడుగుభాగమున నుండి వెడలుచున్నది. క-కనుచుక్క.
B.రక్తాక్షి నిశ్చలనమునొందిన అవస్థ. ఇందు ఒక రక్తాక్షి నిలువున రెండుగా చీలి రెండును కణకవచము (క. క) లోపల నిమిడియున్నవి.
రక్తాక్షి వృక్షమా?
రక్తాక్షులు మెండుగ గల నీటియందు ఆమ్లజనము (O) బుడగలుగ వెడలుచుండును. వృక్షజాతి సూక్ష్మజీవులవలెనే రక్తాక్షియు నీటియందు లీనమైయున్న కర్బనికామ్లవాయువు (CO2) ను హరితకముల మూలమున ఎండవేళల విడదీసి, కర్బనము (C) ను తన యాహారమునిమిత్త ముంచుకొని ఆమ్లజనము (O) ను విడచివేయును. ఇట్టి కారణముచేత నీరక్తాక్షిని చిర