టకు మిక్కిలి సూక్ష్మమైనవిగ నుండి కొన్నితరములు గడచునప్పటికి కొంచెమధికనైన మార్పులను సూచించుచు తుద కనేకతరములు గడచినపిమ్మట జన్మించిన జంతువునకును, దాని ఆదిపురుషు డనదగు మొదటిజంతువునకును గలభేదములు మిక్కిలి యధికమై దానినుండి యిది పుట్టినదని వక్కాణించి నమ్మశక్యముగాక యుండును. ఈ విషయమై వేరొకచో వ్రాయ నుద్దేశించి యిచ్చట విస్తరించలేదు.
నిజాతీయ సృష్టివాదము (Theory of Heterogenesis)
ఒక పిల్లికడుపున ఎలుకపుట్టెననిన కాబోలునని నమ్మువారు నిజాతీయ సృష్టివాదు లనబడుదురు. ఇట్టివారు మానవులనుండి పక్షులును, పాములును (గరుత్మంతుడు, కాద్రవేయులవలె) పుట్టిరనియు, చేపలనుండి మానవులును, (మత్స్యవల్లభువలె) పుట్టిరనియు జెప్పునప్పుడు కాలక్రమమునగాక ఒక్కతరములోనే అట్టి మార్పు గలిగెనని నమ్ముదురు. ఇట్టిది యసాధ్యము.
పరిణామ సృష్టి వాదులు బోధించెడు మార్పు క్రమముగ మెల్లమెల్లన నొకతరమునకంటె రెండవతరమున కొంచె మధిక మగుచు అనేకతరములు గడచునప్పటికి జాతిభేదములు చూపట్టును.