పుట:Jeevasastra Samgrahamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదేప్రకారము ఏజీవియైనను మఱియొక జీవినుండియే పుట్టును గాని అజీవపదార్థములనుండి జీవు లెన్నడును పుట్ట నేరవనియు సిద్ధాంతపరచిరి.

ఈ సృష్టి కాధారమైన ఆదిజీవిగాని జీవులుగాని ఎట్లుపుట్టెనో, అట్టి ఆదిజీవి అజీవపదార్థముననుండియే పుట్టినదో లేక మరి యెట్లు పుట్టినదో నిశ్చయ మెవ్వరికి నింతవరకు తెలియదు. ఈ సంగతి చర్చించుట కిక్కడ స్థలము చాలదు.

సజాతీయ సృష్టివాదము (Theory of Homogenesis)

ఈ విషయమై యిక్కడ కొంచెము చెప్పవలసియున్నది. ఒకజాతిజంతువునుండి అదేజాతిజంతువు పుట్టునుగాని వేరొక జాతిజంతువు పుట్టనేరదు. ఒక పిల్లికడుపులోనుండి ఎలుకగాని మరియే యితరజాతిజంతువుగాని పుట్టనేరదు. ఇదియే సజాతీయ సృష్టివాదము.

పరిణామ సృష్టివాదము (Theory of Evolution)

మానవులు కోతులనుండి పరిణమించిరనియు, పిల్లి, పులి, సింహము మొదలగు ఏకజాతిజంతువులు ఎప్పుడో యొకకాలమున నొక తల్లిబిడ్డలనియు బోధించు పరిణామవాదము మరియొకటి కలదు. కాని యిది పైనిచెప్పిన వాదమునకు విరోధము గాదని తెలిసికొనవలెను. మానవజాతి కోతులనుండి పరిణమించెనని చెప్పునప్పుడు కోతిజాతి మానవజాతిలోనికి మారుటకు అనేకవందలతరములు పట్టునని గ్రహించవలెను. ఒక తరమునకును దాని తరువాతి తరమునకును గల భేదములు గ్రహించు