Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసిరి. వీనిని తొలగించునట్లు వడబోయబడిన గాలిమాత్రమే కుప్పెలోపల ప్రవేశించెను.

ఇట్లు చేసినను ఒక్కొకసమయమందు సూక్ష్మజీవులు వృద్ధిబొందుచు వచ్చెను. అయినను వారు తాము పట్టిన పట్టును విడువక యీ కషాయము చెడుట వారు చేయవలసిన ప్రక్రియల ననుష్టించుటయందు ఏదో లోపముచేతనేగాని తమ వాదమునందు తప్పులుండుటచే గాదని నమ్మియుండిరి.

ఇ ట్లీ రెండుకక్షులవారికిని తీవ్రమైన వాదములు జరిగి తుదకు సూక్ష్మజీవుల బీజములు 130°C-150°C భాగములపర్యంతము వేడి హెచ్చువరకు చావకయుండవచ్చునని వారు కనిపెట్టిరి. పిమ్మట వా రీ కషాయములను 130°C భాగములవరకు మసలనిచ్చి సూక్ష్మజీవులను, వాని బీజములలో చాలభాగమును, చచ్చునట్లు జేసిరి. ఆ కషాయమును తిరిగి చల్లారనిచ్చి మిగిలిన సూక్ష్మజీవుల బీజముల నుత్పత్తి జెందించి, యి ట్లుత్పత్తిజెందిన జీవులను రెండుమూడుసా ర్లీప్రకారము హెచ్చువేడిని మరిగించి చంపి ఆమూలాగ్రముగ శోధించి, యా కషాయమునందలి సూక్ష్మజీవులను బీజములసహితము నశింపజేసిరి. అట్లు తయారు చేసిన కషాయ మెన్నటికిని మురిగియుండలేదు. తిరిగి సూక్ష్మజీవు లెన్నడు నా కషాయమునందు కానబడవాయెను.

అజీవపదార్థమునుండి జీవులు పుట్టవు.

ఇట్టి శోధనలచే కషాయమునందు సూక్ష్మజీవుల బీజ మొక్కటియైన లేనియెడల సూక్ష్మజీవులు జన్మింపనేరవనియు,