చూచువానికి వీనికన్నిటికి తల్లిదండ్రులు గలరా? వాని గర్భమునుండియే ఈ జీవులన్నియు పుట్టుచున్నవా? యను సందియము తోచక మానదు.
తల్లిదండ్రులు లేకనే పుట్టినవా!
పూర్వులు కొంద రీ యల్పజాతిప్రాణులు తమంతట పుట్టుచున్నవనియు (Spontaneously), కొందరు మట్టినుండి పుట్టుచున్నవనియు, మరికొందరు గాలివలన పుట్టుచున్నవనియు ఊహించిరి. తొలకరియందు అకస్మాత్తుగా బెకబెకలాడుచు వేనవేలుగా జన్మించు కప్పలు మట్టినుండి పుట్టినవని కొందరును, ఆకసమున నుండి వర్షించినవని కొందరును, తలచుచుండిరి. నెమలియీకెలను పుస్తకములలో బెట్టియుంచిన నవి పిల్లలను బెట్టునని వీథిబడులలోని బాలురు తలచుచుండుటయు నిట్టిదియే.
సముద్రమునుండి లక్ష్మియు, అగ్నినుండి ద్రౌపదియు పూర్వ కాలమందు పుట్టిరని చెప్పిన నిజమని గ్రహించువారును, మన చెమటనుండి నల్లులును పేలును పుట్టు చున్నవనియు, చీడపురుగులు గాలినుండియు, పేడపురుగులు పేడకుప్పలనుండియు, తల్లు లక్కరలేకయే పుట్టు చున్నవని వాదించువారనేకులు ఈకాలమునందును గలరు.
సూక్ష్మదర్శని అజ్ఞానమును నశింపజేయుట.
ఇన్నూరు సంవత్సరములక్రిందట ఐరోపాఖండస్థులుగూడ నిట్టిసంగతుల నమ్ముచుండిరిగాని వారికి సూక్ష్మదర్శనియొక్క