పుట:Jeevasastra Samgrahamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము.

జీవులు, అజీవులు (The Living and the Non-Living)

సృష్టియందలి సమస్తపదార్థములును జీవులు అజీవులను రెండు తెగలుగా విభజింపబడియున్నవి. జీవులు అనగా ప్రాణముగలవి: జంతువులు, వృక్షములు, అజీవు లనగా నెన్నడును ప్రాణము లేనివి: నీరు, వాయువు, శిలలు మొదలగునవి. జీవులకును, అజీవులకును గల భేదములు మిక్కిలి సులభముగ నున్నట్లు తోచునుగాని యా భేదములు నన్ని చోట్లను విధులుగ వర్తింపవు. ఈక్రిందినిషేధములను (Exception) చక్కగ గ్రంహించునెడల నీవిషయము బోధపడగలదు.

1. జీవులు మిక్కిలి మిశ్రమైన రసాయనసమ్మేళనమువలన (Complex Chemical Combination) నైన మూలపదార్థముచే నేర్పడినవి. అవి కణములరూపమున నమరియుండును. అజీవ పదార్థములయందలి రసాయనసమ్మేళనములు అంత మిశ్రముగా నుండవు. వానికి నిర్ణయమైన నిర్మాణము లేదు.

2. జీవు లితరపదార్థముల నాహారముగా నిముడ్చుకొని, వానిని జీర్ణముచేసికొని తమ మూలపదార్థములో మిళితము చేసికొను శక్తి (Nutrition) గలవి. ఇందుచే సమస్తజీవులకును కొంతవరకు వృద్ధి (Growth) గలుగును. అజీవపదార్థములకు వృద్ధిక్షయములు