పుట:Jeevasastra Samgrahamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుశిలీంధ్రమును కాల్చిన నేమిమిగులును?

ఇదిగాక మధుశిలీంధ్రమును కాల్చి బూడిదచేసినపక్షమున ఆబూడిదలో స్ఫురితామ్లము (Phosphoric acid). పొటాసియామ్లజిదము (Potash), సున్నము (ఖటికామ్లజదము-Lime), మగ్నామ్లజిదము (Magnesia) అను పదార్థములు గలవు. పై జెప్పబడిన వస్తువులన్నియు, మధుశిలీంధ్రకణములనుండియే కలుగుచున్నందున, వీని కాధారమైన పదార్థములను కూర్చునిమిత్తమే పాస్ట్యూరు కషాయపుసరకుల జాబితా (List) లోని 4, 5, 6, సంఖ్యగల పొటాసియ స్ఫురితము (Potassium Phosphate), ఖటికాస్ఫురితము (Calcium Phosphate), మగ్నగంధకితము (Magnesium Sulphate) అను పదార్థములు చేర్పబడినవి.

ఇదియంతయును జూడ నత డీ కషాయము తయారుచేయుటయందు తన ఇష్టమువచ్చిన వస్తువులను ఉజ్జాయింపున వేసియుండ లేదనునది స్పష్టము. ఇందుకు నిదర్శనముగా నీ కషాయమునం దీచెప్పబడిన వస్తువులలో నేది లేకపోయినను మధుశిలీంధ్రము వృద్ధిబొందనేరదు. ఏయేవస్తువులను త్రోపుడుజేసిన నేమేమి లోపములు మధుశిలీంధ్రమునకు గలుగునో ఆలోచింతము.

1. చక్కెర:- ఇది లేకపోయిన నీ కణములు చావవుగాని మిక్కిలి మందముగా వృద్ధిబొందుచుండును. కావున సామాన్యముగా మనము జూచు బురపురలాడుచు నురుగుగట్టెడు ద్రవములలో తప్పక చక్కెర యుండును. పాస్ట్యూరు కషాయపు దినుసులలో చక్కెర తీసివేసినను మిగిలిన పదార్థములయందే