Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగు నితరపదార్థములుగా మారుచున్న దనియు పరీక్ష చే తెలిసికొనబడినది.

పాస్ట్యూరు కషాయము-అతని శోధనలు.

పాస్ట్యూరు (Pasteur) అనునతడు తూనికప్రకారము కొన్ని వస్తువులను చేర్చి ఒక కషాయమును తయారుచేసి అందు కొంచెము మధుశిలీంధ్రమును జేర్చి శోధన చేసి యాకషాయమునందు గలుగు మార్పులను చక్కగా గ్రహించెను. అతడు తయారుచేసిన కషాయమునం దీ దిగువపదార్థములు కలపబడియుండెను:-

- - పాళ్లు.
1 నీరు, (Water) 83.76
2 చక్కెర, (Cane Sugar) 15.00
3 అమ్మోనియా తింత్రిణితము (Ammonium Tertrate) 1.00
4 పొటాసియ స్ఫురితము, (Potassium Phosphate) 0.20
5 ఖటికాస్ఫురితము, (Calcium Phosphate) 0.02
6 మగ్నగంధకితము, (Magnesium Sulphate) 0.02
- - 100.00

ఈప్రకారము కషాయము తయారు చేయుటయం దితడు తన ఇష్టమువచ్చిన వస్తువులను ఉజ్జాయింపున కలుపలేదు. దిగువ నుదాహరించినప్రకారము మిక్కిలి శ్రద్ధగా శోధనచేసి యతని యనుభవముచే మిక్కిలి యావశ్యకములని కనిపెట్టబడిన ఆయా వస్తువుల నిందు జేర్చియున్నాడు.