పుట:Jeevasastra Samgrahamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుర పొంగును. ఆనీళ్లలో నొక చుక్కనెత్తి సూక్ష్మదర్శనియందు పరీక్షించునెడల మధుశిలీంధ్ర కణములు మిక్కిలి వేగముగ స్ఫోటనవిధానముచేత వృద్ధియగుచున్నట్లు అపష్టముగ తెలియును.

ఇట్లు నురుగుగట్టు ద్రవముగల పాత్రములోనికి ఒక దీపమును వెలిగించి దింపినయెడల నది తత్క్షణమే యారిపోవును. ఒక ఈగవంటి జంతువును ఆ పాత్రములోనికి దింపిన నది ఊపిరాడక చచ్చును. ఇట్లు దీపము నార్పునట్టియు, ఈగను చంపునట్టియు పదార్థ మేదియన, రసవాదశాస్త్రజ్ఞులా ద్రవమునుండి వెడలు బొగ్గుపులుసుగాలి (కర్బనికామ్లము CO2) అనియు, అదియే బుడగలుగా వెడలి మరుగు గట్టించుచున్నదనియు కనిపెట్టిరి. కొంతకాలమయినపిమ్మట ఈబొగ్గుపులుసుగాని వెడలుట చూడము. అప్పుడీరసమునందుండు తియ్యదనమంతయు పోయి సారాయివాసన పుట్టును. నిజముగా నందుండు చక్కెరనీరు సారాయిగా మారినట్లు రసవాదపరీక్షచే తెలియగలదు. ఇదియే బీరు సారాయి తయారుచేయుపద్ధతి:- C6H12O6 = 2(C2H6O) + 2(CO2) ̟ఫలశర్కర నుండి మద్యసారమును బొగ్గుపులుసుగాలియు (Grape Sugar) (Alcohol) (Carbon Dioxide) పుట్టును. ఈద్రవమునం దుండు చక్కెరలో నూటికి 95 పాళ్లు సారాయిగను, బొగ్గుపులుసుగాలిగను మారుచున్నదనియు ఒక పాలు మధుశిలీంధ్రకణములయొక్క ఆహారముగా నుపయోగింపబడు చున్నదనియు, మిగిలిన నాలుగు పాళ్లును మధురిక (Glycerine)