Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ నేర్పడును. నాల్గవది యీ మూటిపైని శిఖరమువలె నెక్కి యుండును (ఒ. చూడుము). వీనిలో ప్రతిదానికిని దట్టమైన సెల్లులూసు కణకవచ మేర్పడును. ఇట్లేర్పడిన నాలుగు కణములును కొంత కాలమునకు తల్లికణముయొక్క ఆవరణమును పగుల్చుకొని బయలు వెడలును (ఒ. ఒ3). ఇవియే మధుశిలీంధ్రమునకు బీజములు.

ఇట్టి దళమైన కవచముగల బీజములు ఆహారముగాని, నీళ్లుగాని లేక యున్నను చిరకాలము జీవింపగలవు. తగిన తరుణమునందీ బీజములు మొలక లెత్తి మధుశిలీంధ్రకణము లగును. ఈ బీజములనే చక్కెరనీటినుండి రమ్ముసారాయిచేయు కార్ఖానాదారు లా నీటిలో చల్లుదురు.

మధుశిలీంధ్రముల శక్తిచే సారాయి యెట్లు పుట్టును?

ఇట్టిశోధన చేయునిమిత్తమై యీ క్రిందివిధమున నొక కషాయమును తయారు చేయవలెను. గుప్పెడువడ్లను మొక్క లంకురించువరకు నీళ్లలో నానవేయవలెను. ఇట్లు మొలకరించినపు డీ గింజలయందలి పిండి (Starch), ఫలశర్కర (Grape Sugar) అను నొకవిధమైన చక్కెరగా మారును. మొలకలెత్తు నీ ధాన్యమును వేడినీళ్లలో వేసి కొంతకాల ముంచి ఆద్రవమును వడబోయవలెను. అట్లు వడబోసిన నీళ్లలో చక్కెరయు, కొన్ని మాంసకృత్తులును, లవణములును గలవు. ఇది తియ్యగానుండును. ఇందు పులికల్లునురుగునుండి యెత్తబడిన మధుశిలీంధ్రమును కొంచెము చల్ల వలెను. పిమ్మట కొంత కాలములోనే యానీళ్లు పుర