ఈ పుట ఆమోదించబడ్డది
లక్ష్మణరావు, ఎం.ఏ., గారికిని దూబగుంట-రాఘవయ్యగారికిని కృతజ్ఞతాపూర్వకములైన నావందనము లొసంగెదను.
ఈగ్రంథమునందలి పటములను మిక్కిలిశ్రద్ధతో నెప్పటికప్పుడు అచ్చున కందజేయుచు, నా కేవిధమైన శ్రమయును లేకుండ జేసినందుకు చెన్నపురి చిత్రశాలలో ఆరి తేరినవాడగు ఎమ్. పార్థసారధినాయుని మిక్కిలి కొనియాడవలసియున్నది.
- ఆచంట-లక్ష్మీపతి.
చెన్నపట్టణము,
చింతాద్రిపేట,
18-12-1907.