పుట:Jeevasastra Samgrahamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రికి సులభముగా బోధపడు ననేకాంశముల నిందు వీలుకొలది నిమిడ్చియున్నాను. సూక్ష్మజీవులగూర్చియు హెచ్చుతరగతి వృక్షములగూర్చియు వ్రాయబడిన ప్రకరణము లిందుకొరకే విస్తరించి వ్రాయబడినవి.

ఇందలిపటములు పాఠకులకు కొంతవరకు సహాయముగానుండి దారిచూపుటకు మాత్రమే యుద్దేశింపబడినవి. ఇందు వివరింపబడిన జంతువులను, వృక్షములను సంపాదించి వానిని ప్రత్యక్షముగా సూక్ష్మదర్శనిలో పరీక్షించి చూచినపిమ్మటగాని చదువరులుతృప్తి పొందరాదు.

ఈగ్రంథము వ్రాయుటలో పార్కరు, లౌసన్, మిచ్పల్, ఆలివర్, గ్రిగ్, గ్రీన్ , మొదలగు ప్రకృతి శాస్త్రవేత్తలచే రచియింపబడిన గ్రంథములు నాకు మిక్కిలి యుపకరించినవిగాన వారికి నే నెంతయు కృతజ్ఞుడ నై యున్నాను.

గ్రంథరచన కిదియే ప్రథమప్రయత్న మగుటచేతను, విషయము శాస్త్రీయమగుటచేతను, మొదట వ్రాసిన ప్రతికిని తుదకు నచ్చుపడుప్రతికిని నొక్కొకచో బోలికయే లేకపోవుట తటస్థించునటుల తేప తేప మార్పులుచేసినను వాని కన్నిటికినినోర్చి యీ గ్రంథమును తమ యచ్చుకూటములో ముద్రించుట యందేమి, అక్కడక్కడ నా కనేక సలహాలిచ్చుటయందేమి, మిక్కిలిఓపికయును, శ్రద్ధయునుజూపి నాకు సహాయ మొనర్చిన శ్రీ పరమహంస, విద్యానందస్వాములవారి కెంతయు కృతజ్ఞుడను.

మొదటినుండియు నాయుద్యమమునకు మార్గదర్శకులును, ప్రోత్సాహకులును అగు నామిత్రులు మ-రా-రా శ్రీ, కే. వి.