Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెనేటు అధ్యక్షునికి "రెక్టో యర్”(Recteur) అని పేరు. మన విశ్వవిద్యాలయాల లోని ఛాన్సెలరు, ప్రొఛాన్సెలరు, వైస్ ఛాన్సు లరు, ప్రోవైస్ ఛాన్సెలరు అనేవారి అధికారాలన్నీ ఈయనకుంటివి. విశ్వవిద్యాలయ అధ్యాపకుల లో నుంచి సెనేటువారు ఈయనను ఎన్ను కొంటారు. ఇతను ఒక్క సంవత్సర మే ఆ పదవిలో ఉంటాడు, తరువాత తిరిగి అతనిని ఎన్నుకో కూడ దని నిషేధము లేదు గానీ, సాధారణముగా అతనినే ఎన్ను కోరు, ఓక శతాబ్దములో మూడు పర్యాయములు మాత్రను ఒకే వ్యక్తిని అధ్యక్షుని గా ఎన్ను కొన్నట్లు తెలియవస్తున్నది. రెక్టోయర్ ” పదవినుంచి తొలగిన ఆయన ప్రొ-రెక్టొ యర్ అవుతాడు. ఇది కేవలము గౌరవవోద్యోగము. " రెక్టోయర్ ” ఊరిలో లేనప్పుడు అతనికి బదులుగా అధ్యక్ష స్థానములో కూర్చొనడముతప్ప “పో. రెక్టోయరు” కు మరిఒక పని లేదు.

ఫేకల్టీ అధ్యక్షునికి "డెక్కాస్” అని పేరు. ఇనిని ఫేకల్టీ సభ్యులు ఎన్ను కొంటారు. ఇతడు

92