పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతార్థులయి పట్టములు సంపాదిం చే పద్ధతి జర్మ నీలో లేదు.

పరిపాలనము,

జర్మను విశ్వవిద్యాలయాల పరిపాలసము ఏమీచిక్కు లేనిది. వీటిలో రెండే సభలు, ఇద్దరే ఉద్యోగులు ఉంటారు. (1) ఫేకల్టీలు (2) సెనేటు- ఈ రెండున్ను సభలు. వీటి అధ్యక్షు లే ఉద్యోగులు,


విశ్వవిద్యాలయ ములోని అధ్యాసకులందరున్ను, తముతమ విషయాలకు సంబంధించిన ఫేకల్టీ లో సభ్యులు గా ఉంటారు,సెనేటులో పదకొండుగురు సభ్యులు మాత్రమే ఉంటారు. వీరినే ప్యా కల్టీవారు ఎన్నుకొంటారు. ఏ ఫేకల్టీవారు ఎంత మందిని సెనేటుకు ఎన్ను కోవలెనో శాసనము ప్ర కారము నిశ్చయమై ఉంటుంది. విశ్వవిద్యాలయ ములో' సెనేటు సభ్యులు మాత్రమే గౌనులు వేసు గొనడానికి అర్హులు. ఒకొక్క ఫేకల్టీ కీ సభ్యులు ఎన్నుకొన్న 5 నుంచి 7 గురు వరకుగల ఒక కార్యనిర్వాహక సంఘముంటుంది.

91