పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు. ఈ ఇరవైయారు పరగణాలలో ఒక్కొకదానికి ఒక్కొక పార్లమెంటు ఉన్నది. మూల ప్రభుత్వము, అనగా జర్మను సామ్రాజ్యము నకు 'రీచ్సటగ్' (Rcichstag) అని ప్రత్యేక పార్లమెంటు ఉన్నది. దీనిలోని సభ్యులను ప్రజలే యెంచుకొంటారు. వాటి వాటి జనసంఖ్యను బట్టిన్ని, ప్రాముఖ్యము బట్టిన్ని, ఏ పరగణావారు ఎందరు సభ్యులను ఎంచుకొనవలెనో ఏర్పాటయి ఉంటుంది. ఈ పార్లమెంటు అధ్యక్షుని ప్రజలే స్వయముగా ఎన్నుకొంటారు.

సైన్యము, పరదేశములతో సంబంధము, పోస్టాఫీసులు, రైళ్లు, ఓడలు, మదలైన వాహనములు ఇవి మూల ప్రథుత్వమునకు సంబంధించినవి. వీటిని మంత్రులు చూస్తారు. రైళ్ల పరిపాలనము ప్రభుత్వము చేతిలోనే ఉంటుంది గాని ఇంగ్లండులో వలె కంపెనీల అధికారములో ఉండదు. మూల ప్రభుత్వమునకు సంబంధించని విషయములను ఆయా పరగణాల మంత్రులు చూచుకొంటారు. ఇండియాలోను ఇంగ్లాండులోను కొన్ని