Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్మనీలో ఈవసతిబడులు ప్రారంభము లో ఉన్నవి. కాని, జర్మనులు ఇటువంటిబడు లింకా ఎక్కువగా కావ లెనంటున్నారు. ఇంగ్లీషు పబ్లికు , స్కూళ్ళలో తమ వసతిగృహము, తమబడి, అనే అభిమానము ఎక్కువగా ఉంటుంది. ఈ అభి మాసము జర్మనీలో ఇంకా స్థిర పడ లేదు,

అధ్యాయము 11

విశ్వవిద్యాలయము లం, వృత్తికళాశాలలు.

(హాక్ షూలె Hoch Schule.)

ఉన్నతపాఠశాలలోని అంత్య పరీక్ష అయిన “ఆబిట్యు రియెంటెస్" పరీక్ష ప్యాసయిన వారినే చేర్చుకొనే కళాశాలలను ఈ క్రిందిరీతిగా విభజించ వచ్చును. (1) విశ్వవిద్యాలయములు: వీటిలో కళ లు, శాస్త్రములు, వైద్యము, స్మృతులు (Iaw), మతము నేర్పుతారు. కొన్నిటిలో వ్యవసాయము కూడా ఉంటుంది.

82