Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయమున్ను , ఒక ఉపాధ్యాయుని వశమ లో ఉంటుంది. ఈ బడిలో చర్చాసంఘము లేదు.

విద్యా పద్ధతులున్ను, విద్వోపకరణములు న్ను, మిక్కిలి నవీనమార్గము ననుసరించి ఉన్న వి. విద్యార్థులకు కావలసినన్ని మంచి పుస్తకము లున్నవి. ప్రతి ఉపాధ్యాయునికిన్ని , 200 నుంచి 500 పుస్తకాలవరకు స్వంతముగా ఉంటవి. పాఠాలు చెప్పే గదులన్నీ వేరు వేరుగా ఎడ మెడ ముగా ఉన్నవి. అన్నీ ఒక్కటే భవనములో లేవు. ఈబడిలో అనుభనవిద్య మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ప్రతివిద్యార్థిన్ని మధ్యాహ్నము రెండు గంటలకాలము ఏదోఒక చేతి పని చేయవ్లెను. పిల్ల లువడ్రంగము, కమ్మరము కాక తోటపని, పొలముపని కూడా చేస్తారు. బడిలోని బెంచీలు, కుర్చీలు, మొదలయిన సామానులను పిల్లలే చేస్తారు. వాటికి చిన్న చిన్న మరమ్మతులు కూడా వారే చేస్తారు. శాస్త్రమును బోధించే గదులు పరిశోధనాగారములుగా కూడా ఉపయో గించేటట్లు కట్టుతారు.

81