పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపాధ్యాయులు ప్రత్యేకముగా వంట చేసుకో కూడదు. మద్యాహ్న భోజనమయిన తరువాత విద్యార్థులందరున్ను ఇంటి ముందర అంగణములో కూడుతారు. వర్షముగా ఉంటే, హాలలోనే కూడు తారు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు. చిన్న ఉపన్యాస మిస్తాడు. అతని తరువాత ఒకరిద్ద రుపాధ్యా యులున్ను కొంత మంది విద్యార్థులున్ను మాట్లాడుతారు. ఆ దినమునకు కార్యక్రమమును అక్కడనే అందరికిన్ని తెలుపు తారు. విద్యా ర్థులు తమలో తామెంచుకొన్న అయిదుగురు స్వ దేశ, విదేశ, వార్తా పత్రికలు చదివి, వాటిలోని భోగట్టాను సంగ్రహముగా అందరికిన్ని తెలుపు తారు. పక్షమున కొక సారి, ఒక విద్యార్థి దేశమునకు సంబంధించిన ఏదయినా ఒక విషయమును గురించి వ్యాసమువాసి చదువు తాడు. ఆ విషయమును గురించి విదేశీయ వార్తా పత్రికల అభిప్రాయము కూడా తెలుపు తాడు. ఈవ్యాసము వ్రాయడానికి ఉపాధ్యాయలు సహాయము చేయవలెను. విద్యార్థులకు పఠనాలయమున్ను



80