పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోని పిల్లలు ధనవంతుల కుటుబములోనుంచి వస్తారుగనుక, చాలాదూరవిహారాలు చేయడమే కాకుండా, పర దేశాలకు కూడా పోతూ ఉంటారు.

బడిలోని పిల్లలందరున్ను, ఒక టేచావడిలో భోజనము చేస్తారు. ఒకొక్క టేబిలువద్ద ఒకొక్క గృహము ల్లలు కూర్చుంటారు.ఈ టేబిలువద్ద ఒక ప్రక్క యజమాను మున్ను, అతని కెదురుగా యజమానురాలున్ను కూర్చుంటారు. వంటగదిలో విద్యుచ్ఛక్తితో పని చేసె ఉపకరణము లుంటవి. రొట్టెలను ఒకటే దళసరిగా ముక్కలు కోస్తారు. కూరగాయలను యంత్రాలతో తరుగు తారు. రొట్టెకు పిండి విద్యుచ్ఛ క్తి యంత్రాలతో విసురుతారు. ఈ ఉపకరణాలన్నీ కొంచెము వెలలకు చిక్కు తవి.ఈ బడిలోని పిల్లలు భోజన విషయమై ఏమాత్రమున్న అసంతృప్తి పొందరు. దీనిలోని రహస్య మేమిటంటే, ఉపా ధ్యాయులు, వారి భార్యలు, పిల్లలు, బడిపిల్లలు, తుదకు ప్రధానోపాధ్యాయుడు కూడా ఒక టే టేబి లు మీద, ఒక్క మోస్తరు భోజనమే చేస్తారు.

79