ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తక్కిన ఉన్నత పాఠశాలలలోవలె ఈ పరీక్షను "క్లాసు ఉధ్యాయులే చేస్తారు. ఆమండలము ఇన్స్పెక్టరుకూడా ఉ పాధ్యాయులతో కలిసి ఈ పరీ క్షను జరిపిస్తారు. ఇన్ స్పెక్టరు గవర్నమెంటు బడుల మీదకంటే, ఈ ప్రయి వేటు బడులమీద ఎక్కువ శృద్ధ తీసుకొంటాడు. ఆడపిల్లలు మగ పిల్లల పాఠ ములనే చదివి, వారి పరీక్ష లోనే కృతార్థురాండ్రు కావలెను. చేతిపనులలో మాత్రము కొంచెము భేదమున్నది. మగపి ల్లలు వడ్రంగము, కమ్మరము, యంత్రర్మాణము నేర్చుకొంటారు. ఆడపిలలు కుట్టుపని, వంట, గృహ నిర్వాహక త్వము నేర్చుకొంటారు,
పిల్లలకు ఏవిధమయిన దండనమున్ను చేయరు. జర్మనీ దేశములో పిల్లలకు దేహదండనము నీ షేధింప బడినది. జర్మను పిల్లలు బడుల కట్టు బాట్లను ఎన్నడున్ను మీరరట, ఈ బడులలో అట్టి 'రూల్సు' లేకపోవడమే వాటిని అతిక్రమించక పోనడానికి కారణమై ఉంటుంది. ఇతర బడులలో ఉండే 'ఇట్లు చేయవలెను', 'ఇట్లు చేయకూడదు'
75