పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గమనింప దగినది. సంవత్సరము రాబడి 19000 పౌనులు. ఈ మొత్త ము ఖర్చులకు సరిపోతుంది. భోజనము ఖర్చంత, చదువుజీతమింత, నాలుగు కాలాలుండే వస్తువుల మీద ఖర్చింత, నిత్యమున్ను అయ్యే ఖర్చింత, ఆ నే విభేదములు చేయరు. కొత్త ఇళ్ళు కట్టించడా ని కిన్ని, ఇటువంటి ఇతర పెద్దఖర్చులకున్ను, బాలురు చెల్లిం చే సొమ్మ చాలదు.

ఈ బడిలో మగపిల్లలు, ఆ పిల్లలు కలిసి వసతిగృహాలలో ఉండము ఇంగ్లాండులోని క్వేకరు ( quaker Schools) బడుల ననుసరించి ఈ విధానము నేర్పాటు చేసినారు. మగపిల్లల గదులనుంచి, ఆ పిల్లలగదులను వేరు చేయవచ్చును. ఇట్లు ఆడపిల్ల లున్ను మగపిల్ల లున్ను కలిసి ఉండడమువల్ల ఎట్టిదోషములున్ను కలుగ లేదు. కాని ఈ పద్ధతి ఎంతో కాలము అమ లులో లేకపోవడము చేత, ఈ పద్ధతి ఎంతవరకు సాగ గలదో ఇంకా చెప్పడానికి వీలు లేదు.బాలబాలిక లిద్దరుస్ను ఈవసతిగృహములో 19 ఏళ్ళు వయస్సు వరకు ఉండి అబిట్యురియంట్ పరీక్షకు పోతారు.


74