పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

జర్మనీదేశపు విద్యావిధానము.

ఆధ్యాయము 1.

మధ్యకాలపు జర్మనీదేశములో మూడు వందలకు పైగా పరగణాలు (States) ఉండేవి. వీటిలో కొన్ని చర్చి అధికారము క్రిందను, కొన్ని దొరతనము అధికారము క్రిందను ఉండేవి. ప్రషియా దేశము అభివృద్ధి పొందడము, ఫ్రన్సు దేశములో విప్లవము జరగడము, పంతొమ్మిదో శతాబ్ద మద్య భాగములో జాతీయతా భావము విజృంభించడము, ఈ మొదలైన కారణముల చేత భిస్మార్కు యువరాజు తన పలికుబడి నుపయోగించి వేరు వేరుగా ఉన్న చిన్న చిన్న పారగణాల నన్నిటిని చేర్చి పెద్ద పరగణాలుగా యేయగలిగినాడు. 1870 సం. లో 26 పరగణాలతో జర్మను సామ్రాజ్యము ఏఎర్పడినది. ఈ పరగణా లన్నిటికి ప్రష్యా