పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతదూరములో, పల్లెటూళ్ళమధ్య ఉంటుంది. టెర్ముకు ఒక వారము రోజులు ప్రతి తరగతి వారున్న ఈ ఇంటికిపోయి అక్కడ నే నివసిస్తారు. ఇక్కడ పిల్లలు తమ తిండికోసము సొమ్మిచ్చుకోవలెను. రోజున్ను రెండు.గంట లిక్కడ పాఠములు జరుగు తవి; తక్కిన కాలము పిల్లలు ఏదో ఒక అనుభవము సంపాదించుకొంటూ ఉంటారు. పదార్థవిగ్నాన శాస్త్రము చెప్పే ఉపాధ్యాయును సాధాణ వస్తు వులతో టెలిఫోనులు నిర్మించగా, ఒకరితో ఒకరు దూరమునుండి మాట్లాడు కొంటారు. బోధించే ఉపాధ్యాయుడు నక్షత్రప పరిశోధనము చేయిస్తాడు. ఈగృహమున కనుబంధముగా ఒక పొలము కూడా ఉంటుంది, దానిమీద పిల్లలు పని చేస్తారు. పట్టణాలలో ఉండే బాలురకు పల్లె టూరిజీవనము ఏలాగు ఉంటుందో చూపి నిజమైన జీవనముతో వారికి పరిచయము కలిగించడమే ఈగృహము ఉద్దేశము. ఇక్కడ పిల్లలకు మనసుకు వచ్చినంత మంచిగాలి, వ్యాయామము:, లభించడమే కాకుండా, వారు స్వయముగా పని చేసు


70