పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నౌకాలయాలు, మొదలయిన కార్ఖానాలకు పో- తారు. ప్రతి విద్యార్థిన్ని తాను చూచినదంతా వ్రాసుకొని, విహారమును గురించి ఉపన్యాసము వాయవలెను. ప్రధానోపాధ్యాయుని యాజ మాన్యమున నడిపే బడి పత్రికలో వీటిలోకొన్ని టిని ప్రకటిస్తారు.

విద్యార్థులకు తమతమ సంఘము లున్నవి కాని ఇంగ్లాండులో ప్రతిబడి లోను ఉండే చర్చా సంఘము లున్నున, పఠనాలయాలున్ను జర్మనీలో లేవు.

ఆల్లిదండ్రుల సంఘములు .

( ఏల్ టెర్న బెయ్ గాట్ Elternbeirat)

జర్మ నీ ప్రతిబడిలోసు శాసనము ప్రకా రము ఒక తల్లిదండ్రులనంఘ ముంటుంది. దీనిలోని సభ్యులను పిల్లల తల్లిదండ్రు లెన్ను కొంటారు. 50 మంది పిల్లలకొక సభ్యుడు చొప్పున బడిలోని పిల్లలసంఖ్యను బట్టి ఈ సంఘములొ సభ్యుల సంఖ్య కూడా ఉంటుంది గృహవిద్యకున్ను పాఠశాలా విద్యకున్ను సామరస్యము కల్పించడము, పిల్లల

68