పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంత్సరానికి 60 పౌనులు మాత్రము ఎక్కువగా ఇస్తారు. విద్యార్దులలో నూటికి 20 మందికి ఉచితముగా చదువు చెప్పుతున్నారు. తల్లి దండ్రుల మొదటి కొడుకుకు గాని కూతురుకు గాని నిండు జీతము చెల్లించవలెనన్నీ, రెండో కొడుకు లేక కూతిరికి నిండు జీతములో 3/4 వంతున్ను, మూడో కొడుకు లేక కూతురికి సగమున్ను చెల్లించవలెననిన్నీ, తరువాతి కొడుకులకు, కూతుళ్ళకు జీతము చెల్లించ నక్కర లేదనిన్నీ, జర్మినీలో ఒక పద్ధతి ఉన్నది. ఒక్క తల్లిదండ్రుల పిల్లలందరున్ను ఒకే బడిలో చదువుకోనక్కర లేదు. పిల్లలు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు, వృత్తి కళాశాలలు, ఉన్నత పాఠాశాలలలో చదువు కొంటూ ఉన్నా, ఇదే పద్ధతిగా జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు వర్ణిస్తూ ఉన్న బడిని దాని కోసము కట్టిన భవనములోనికి మార్చినారు. దానిలోని వసతి, దాని ఆకారము దానిలోని విద్యా సాధన సామగ్రి, అంతా మిక్కిలి నవీన పద్ధతులమీద ఉన్నది. ప్రతి గదికిన్ని విద్యుచ్చక్తి చేత నడిచే గడియారమున్నది. ఈ గడి

64