పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుద్ధము ముగిసిన తరువాత, జీతము చెల్లించుకొన గలిగిన వారికే ఉన్నత విద్య అనే అభిప్రాయము మారిపోయినది. దాని ప్రకారము ఈ బడులు ఏర్పాటయినవి. ఇవి ప్రాన్సు దేశము లోని కళాశాలలకు సరిపోతవి. పేద పిల్లల లో చాల మందికి జీతము లేకుండానే విద్యను బోధించే సదుపాయములు ఈ బడులలో చేయ బడ్డవి. ఈ బడులలో చెప్పే విషయములున్ను, ఎవరికి కావలసినవి వారికి ప్రత్యేకముగా చెప్పుతారు.

ఇంకా బీదవారికోసము, పగటి పూట కర్మాగారాలలో పని చేసుకొని వచ్చి చదువుకొనడానికి సాయంకాల ఉన్నత పాఠశాలలు కూడా (Evaening High Schools) ఉన్నవి. ఇంతకు పూర్వము ఉపాద్యాయులే మెట్రిక్యులేషను పరీక్షను చేస్తూ ఉండడము చేత ప్రయివేటుగా ఆపరీక్షను ప్యాసుకావడమునకు అవకాశము లేండేది. ఇప్పుడు

59