Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారు. ఇవిగాక వృక్షశాస్త్రమును, జంతు శాస్త్రమును బోధిస్తారు.

(3) ఓబర్ రియల్ షూలె (Ober real shUle): ఈబడులలో నవీన శాస్త్రములు ఎక్కువగా నేర్పుతారు. లాటిను, గ్రీకు భాషలకు బదులుగా గణితము, పదార్త విగ్నాన శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవ శాస్త్రములను విశేషముగా బోధిస్తారు.

ఓబర్ ప్రైమా(Ober pria) ఆనే మీది క్లాసులో వారమునకు ఈ మూడు విధములైన బడులలోను నేర్పే విషయాలనున్ను, క్రొత్త రకము బడులయిన "రిఫార్మడ్ జిమ్నేసియమ్" (Reformed Gynmasium) అనే బడులలోను అమలులో ఉన్న అపాఠ క్రమము ఈ క్రింద చూపబడినది......

57