పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 మంది ఈ ఉన్నత పాఠశాలలో చేరుతారు. పట్టణాలలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక పట్టణ సాధారణ పాఠశాలలో నూటికి 30 మంది ఉన్నత పాఠశాలలో చేర నిశ్చయించు కొన్నారట. ఈ ఉన్నత పాఠశాలలసంఖ్య 2,400. ఇందులోని విద్యార్తులసంఖ్య 8,00,000. పెద్ద ఉన్నత పాఠశాలలో 800 మంది పిల్లలుంటారు. ఉపాద్యాయుల సంఖ్య 43,561; వీరిలో నాలుగో వంతు మంది ఆడవాళ్ళు. ఉన్నత పాఠశాలలు నాలుగు విధములుగా ఉంటవి.

(1) జిమ్నేసియములు. (GYMNASIUMA): ఇవి పురాతబఓద్దతుల ననుసరించేవి. వీటిలో లాటిను, గ్రీకు, అనే ప్రాచీన భాషలనునిర్బంధముగా నేర్పుతారు. ఇప్పుడు ఫ్రెంచి భాషకంటే ఇంగ్లీషును ఎక్కువగా చెప్పుతారు.

(2) రియల్ జిమ్నేసియమ్(Real Gymnasium): ఈ బడులలో గ్రీకుభాష నేరరు గాని, లాటిను భాష నిర్బంధము. గ్రీకు భాషకు బదులుగా ఇప్పటి యూరోపియను భాషను నేర్పు


56