పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాయము 8

ఉన్నత విద్య.

జిమ్నేసియం (Gynbasuyn) రియల్ జిమ్నేసియం(Reak Gymnasim) ఓబర్ రియల్ షూలె (Ober real shule),ఔఫ్ బౌ షూలె (Aufbau shule)

జర్మనీలో పిల్లలందరున్ను సామాన్య విద్యాలయాలలో నాలుగేళ్ళు మొట్టమొదట నిర్బంధముగా చదువ వలెనని మూడో ఆధ్యాయములో తెలుప బడ్డది. ఉన్నత పాటేహశాలలలోనికి పిల్లలను పదేళ్ళ వయస్సున చేఎర్చు కొంటారు. ఇక్కడ వారు తొమ్మిదేళ్ళు చదువు కోవలెను. ఈ క్లాసులకు వరుసగా సెక్ట్సా(Sexta) క్విన్టా (Quinta) క్వార్టా(Quarta), ఉంటల్ టెర్షియా(Unter tertia), ఒబర్ తెర్షియా( Uber tertia), ఉంటర్ సీకుండా (Unter secunda), ఓబర్ సెకుండాం(Uber sekumdaa) ఉంటర్ ప్రైమా( Unterprima), ఓబర్ ప్రిమా( Uber prima), అని పేళ్ళు. విద్యార్థుల మొత్త్తము సంఖ్యలో నూటికి

55