పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పల్లెటూరి బడుల ముఖ్యలక్షణము, వాటిలో నేర్పే విషయములు కాదు. ఆయా విషయాలను నేర్పే పద్ధతియే గమనింపదగినది. ఉదాహరణకి, అన్ని బడులలోను గణితేము నేర్పుతారు గాని ఒకొక్కరీతి బడిలో ఒకొక్కతీరు లెక్కలు చెప్పుతారు. ఒకొక్కరీతి బడికి ప్రత్యేకముగా పఠనీయ గ్రంధాలు వ్రాస్తారు. ఏవో ప్రాత విషలమీదను, జీవితానికి అవసరము లేని విషయాలమీదను కాలము వృథాచేయరు. పిల్లల నిత్యజీవనానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రత్యేకించి వాటిని గురించి మాత్రమే చెపుతారు. ఉదాహరణానికి, పొలములను స్వయముగా కొలిపించి, విత్తుల ఖరీదును, పండిన పంట ఖరీదును పిల్లల చేత కట్టిస్తారు. ఇట్లే, ఇతర విషయాలలో కూడాను. ఇత్రలేఖనము, చరిత్రము, భూగోళ శాస్త్రము, వాచక ఉస్తకాలు, ఇవన్నీ గ్రామ జీవనము మీద పిల్లల దృష్టి నిలిచేటట్లు చేస్తవి.ఈ పల్లెటూరి బడుల ఉపాధ్యాయులను ఆచుట్టుపట్ల వారినే నియమిస్తారు. వారికి ఆయాగ్రామాల


50