మందిన్ని, యూదులు నూటికి 0.3 మందిన్నీ ఉంటారు. వీరిద్దరికిన్ని ప్రత్యెకముగా బడులున్నవి. వీటిలో ఆయా మతస్థులే ఉపాధ్యాయులుగా ఉంటారు. వీటికయ్యే ఖర్చు అంతా మూల ప్రభుత్వమే భరిస్తుంది. రోమను కాథొలిక్కులకు తమ బోధనాబ్యసన కళాశాలలున్నవి. కాని యూదులకు లేవు. యూదులు కొంచెము మందె ఉండటమున్ను, వారున్ను అక్కడక్కడ చెదిరి ఉండడమున్ను దీనికి కారణములు. చిన్న పట్టణాలలో ప్రత్యేకముగా వీరికి బడులు పెట్టడానికి చాలినంత మంది విద్యార్థులు లేక పోవడము చేత వీరి పిల్లలను ప్రొటెస్టాంటే బడులలోనే చేర్చుకొంటారు. మొత్తము మీద జర్మినీ దేశములో పొటెస్టాంట్ బడులలో చదువుకొనే రోమను కాథొలిక్కు పిల్లలు నూటికి 1.7 మందిన్ని,యూదుల పిల్లలు నూటికి 0.4 మందిన్ని ఉన్నారు. రోమను కాథొలిక్కు బడులలో ప్రొటెస్టాంటు పిల్లలు నూటికి 0.8 మందిన్ని, యూదుల పిల్లలు నూటికి 0.1 మందిన్ని ఉన్నారు. తరగతి ఉపాధ్యాయుడే మత విద్య
40