ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జర్మనీ దేశములో విద్యా పరిపాలనము మూల ప్రబుత్వము వారిది కాదనన్నీ, అది రాష్ట్రీయ ప్రభుత్వముల వారిదనిన్ని, ఇంతకుముందు తెలుపబడినది. ప్రతి రాష్ట్రమున్ను తనబడుల పరిపాలనము నిమిత్తము కట్టుదిట్టమును చేసుకోవలెను. అందు చేత మూల ప్రభుత్వ శాసనసభ(Reichstig) నిర్వహించిన పద్ధతి ప్రకారము, ఆయా రాష్ట్రముల శాసబసభలవారు కూడా శాసనములులుచేసికొని ఇప్పుడు దేశమంతటా ఈసాధారణ విద్యాలయాలను స్థాపించినారు. ఇప్పుడీ ఉద్యమము ఒక్క జర్మినీ దేశములో మాత్రమమలులో ఉన్నది. స్విట్జరులాండు దేశము కూడా ఈ పద్ధతి నామోదించినది. యుద్ధానికి పూర్వము బాల బాలికలను ఉన్నత విద్యాలయాలలోనికి ప్రవేశ పెట్టడానికి ఏర్పడిన "ఫార్ షూలే" అనబడే ప్రారంభ విద్యలయాలు ఉన్నత విద్యాలయాలకు అనుబంధములుగానో, ప్రత్యేక విద్యాసంస్థ గానో ఉండేవి. ఇప్పుడవన్నీ అంతరించి పోయినవి. ధనవంతులు గానీ, పేదవారు గానీ,
27