పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ఐక్యమంతా చెదిరిపోయి, ఎప్పటి వలె ఆయా రాష్ట్రములు ప్రత్యేకముగా వీడి పోతవనే భయము కలిగినది. అయినా, విద్యా సంబంధమైన ఐకమత్య మొకటి ఈ మధ్య తలచూపి, జర్మను భాష మాట్లాడే జనులందరున్ను ఒక దేశము వారె అనే భావము ప్రభలుతున్నది. ఈ ఐకమత్యము నిలకడ పొందవలెనంటే, సాంఘిక విభేదములను పాటింపని సాధారణ విద్యా విధానమున్ను, సాధారణ విద్యాలయములున్ను, కావలెను. 1920 సం. లో జర్మను సామ్రాజ్య విద్యాసభకూడ, ఈ భావమును బలపరచి, దేశమందంతటా సాధారణ విద్యాలయములు స్థాపితములు కావెలనని తీర్మానించినది. ఆ మరుసటి సంవత్సరము మూల ప్రభుత్వ శాసబసభలో (Reichstag) ఉన్నత విద్యాలయముల లోని క్రింది నాలుగు తరగతులను తీసి వేయవలసిన దనిన్ని, వాటిని వేరే ఏర్పాటు చేసి అందులో ధనికులు పేదవారు అనే భేదము గాని, వృత్తుల బేదముగాని పాటింపక, అందరు పిల్లలను చేర్చుకోవలసినదనిన్ని, ఒక శాసనము చేయబడ్డది.


26