పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాయము. 5

"గ్రుంట్ షూలె లేక ఐన్ హేట్ షూలె"

.

సాధారణ పాఠశాలలు

జర్మను దేశమంతే ఏకముగా ఉండవలెనంటే, ధనికులు పేదలు అనే భేదము లేకుండా అందరికీ సాధారణముగా బడులు ఉండవలెననిన్నీ కొద్ది కాలములో ప్రారంభ విద్యనుంచి కళశాల విద్యవరకు విద్య అంతా జర్మను జనుల కందరికీ సామాన్యముగా ఉండగలదనిన్నీ, 1848 సం. రములో సేవెర్ను అనే రాజకీయ వేత్త పలికినాడు. మొన్నటి యుద్ధ సమయములో అనేక అంతేరువుల మనుష్యులు సైనికులుగా ఒకరితో ఒకరు కలియవలసి వచ్చినది. అప్పటినుంచి ఆయా అంతరువుల మనుష్యులకు ఇంకా దగ్గర సాంఘిక సంబంధము కుదురు కోవలసినదనే అభిప్రాయము దృఢపడినది. జర్మను చక్రవర్తి అయిన కెయిజరు ఇరావైయారు రాష్ట్రములను జర్మనుసామ్రాజ్యము లోనికి తెచ్చి, జర్మనీ దేశమంతా ఒక్కటే దేశమనే ఊహను నెలకొల్పినాడు. కాని, యుద్ధము ముగియగానే

25