పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైన వస్తువులను తన విద్యాపద్ధతికి సాథనాలుగా ఏర్పాటు చేసినది. ఇప్పుడు జర్మినీలోను, ఇంగ్లాండులోను కూడా, ఇవే బహుమానము లుండవలెననే అభిప్రాయము పోయినది. ప్రతి ఉపాద్యాయురాలున్ను, తేన చుట్టుప్రక్కల కనుగుణముగా ఉండే బహుమానాలను ఏర్పాటు చేసు కొంటుంది. ఫ్రోబెల్ పద్ధతి మంచిదే కాని, దానిని ఉపయోగించడములో తప్పులు చేస్తున్నారని విద్యాధికుల అభిప్రాయము. ప్రపంచమంతటా ఫ్రొబెలు ఏర్పాటు చేసిన బహుమానములే ఉండ వలెననడము అతని అభిప్రాయనికి విరుద్ధము. ప్రతి ఉపాధ్యాయుని యున్ను తన బహుమానాలను పిల్ల తెలివి తేటలను బట్టి తానే ఏర్పాటు చేసుకోవలెను. ఈ బహుమానాలకోసము ఉపయోగించే పదార్థములు బెడద లేకుండా, పిల్లలకు తెలిసినవై ఉండవలెను.

జర్మినీలో నూటికి పది మంది పిల్లలు ఈ కింటర్ గారేన్ బడులకు పోతారు. తక్కిన తొంబైమందిన్ని తమ యిళ్ళలో చదువు కొంటారు.

22