పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోని వారికి ప్రవేశము లేదు.

పైరీతిగా ప్రాథమిక విద్యాలయాలు నాలుగు విధములుగా వున్నవి.

ఈ బడులన్నిటిలోని ఆడపిల్లలు, మగ పిల్లలు కూడ కలిసి చదువుకొంటారు. పట్టణాలలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న బడులలో ఆడ పిల్లలనందరినీ ఒక భాగములోను, మగ పిల్లలనందరినీ మరి ఒక భాగములోను ఉంచుతారు. కొన్ని స్థలాలలో, ఆడపిల్లల బడులున్ను, మగ పిల్లల బడులున్ను, వేర్వేరుగా ఉంటవి.

మొత్తము మీద, ఆడపిల్లలకున్ను, మగ పిల్లలకున్ను నేర్పే విద్య ఒక్కటే. కాని, మగ వారికి వడ్రంగము, కమ్మరము, పదార్థ విగ్నా శాస్త్రము ఎక్కువగా నేర్పుతారు. ఆడపిల్లలకు వంట , కుట్టుపని, వృక్షశాస్త్రము ఎక్కువగా నేర్పుతారు. వేసే ప్రశ్నలలోను, చూపే బొమ్మలలోను కూడ మగ బడులకున్ను, ఆడ బడులకున్ను భేదమున్నది. ఆడ పిల్లల బడులలో సాథారణముగా ఆడవాళ్ళే ఉపాద్యాయులుగా ఉంటారు.


19