Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాయము .3

ప్రాథమిక విద్య.

ప్రాథమిక విద్యకున్ను, ఉన్నత విద్యకున్ను భేదము కాల్పనికమే కాని వాస్తవము కాదని క్రిందటి అధ్యాయములో తెలుప బడ్డది. ఈ ఆద్యాయము నిమిత్తము ప్రాథమిక విద్యాలయాలంటే ఆబడులలో జరిగే తుది పరీక్ష విశ్వవిద్యాలయాలోనికి ప్రవేశము కల్పించ నటువంటివి అని నిర్వచనము చేయ వచ్చును.

ప్రాథమిక విద్య "గెమిండె " "స్టాడ్ ట్ "అనే స్థానికిక పరిపాలనము వారి చేతులలోనే ఉన్నదని మొదటి ఆధ్యాయములో చెప్పబడ్డది. ఈ ప్రాధమిక విద్యాలయాలకు సాథారణముగా డబ్బంతా మూల ప్రభుత్వము వారె ఇస్తారు. ఆ విద్యాలయాలకు గ్రాంటులు, ఆయాబడులలోని ఉపాద్యాయుల సంఖ్యను బట్టిన్ని, విద్యార్థుల సంఖ్యను బట్టిని ఉంటుంది. ఉపాధ్యాయల సంఖ్యను బట్టి మాత్రమే గ్రాంటు లిస్తే ప్రతి బడిలోను కావలసినంత మంది కంటె ఎక్కువ మంది ఉపాధ్యా


17